ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని రోడ్డు దాటుతున్న వ్యక్తి మృతి చెందాడు.
మంగళగిరి(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెద‍్దవడ‍్లపూడి గ్రామ శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో వృద్ధుడు మృతిచెందాడు. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు, రోడ్డు దాటుతున‍్న వృద్ధుడిని ఢీకొనడంతో అతను అక‍్కడికక‍్కడే మృతిచెందాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స‍్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుని వివరాలను సేకరిస్తున్నారు.