
మద్యం మానితే రూ.20 లక్షల నజరానా
తూర్పుతాళ్లు గ్రామస్తులు మద్యానికి దూరంగా ఉంటే రూ.20 లక్షలను ప్రోత్సాహక బహుమతిగా అందిస్తామని కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. నరసాపురం మండలం తూర్పుతాళ్లు
నరసాపురం రూరల్ : తూర్పుతాళ్లు గ్రామస్తులు మద్యానికి దూరంగా ఉంటే రూ.20 లక్షలను ప్రోత్సాహక బహుమతిగా అందిస్తామని కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో మంగళవారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు సభలో ఆయన మాట్లాడారు. గ్రామస్తులలో ఎక్కువమంది మద్యానికి బానిస కావడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడ్డాయన్నారు. అందరూ ఒకేమాటపై ఉండి గ్రామాన్ని సంపూర్ణ మద్యపానం నిషేధ గ్రామంగా తీర్చిదిద్దితే ఈ బహుమతి అందిస్తామన్నారు. ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేలు అందిస్తోందని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్విని యోగం చేసుకోవాలన్నారు. మండల ప్రత్యేకాధికారి, సీఈవో డి.వెంకటరెడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుత్తుల బలిచక్రవర్తి, బండారు ఇస్సాకు, ఎంపీపీ వాతాడి కనకరాజు, జెడ్పీటీసి బాలం ప్రతాప్, ఎంపీడీవో ఎన్వీ శివప్రసాద్‌యాదవ్, తహసిల్దార్ శ్రీపాద హరనాథరావు పాల్గొన్నారు.