బండ్ల గణేష్‌కు నోటీసులు | Notices to Bandla Ganesh | Sakshi
Sakshi News home page

బండ్ల గణేష్‌కు నోటీసులు

Oct 2 2014 12:57 AM | Updated on Sep 2 2017 2:14 PM

చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు బంజారాహిల్స్ పోలీసులు బుధవారం నోటీసు జారీ చేశారు.

హైదరాబాద్: చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు బంజారాహిల్స్ పోలీసులు బుధవారం నోటీసు జారీ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా అందులో సూచించారు. రెండు రోజుల క్రితం గుంటూరుకు చెందిన విత్తనాల వ్యాపారి ధర్మచరణ్ తులసి బంజారాహిల్స్ పోలీసులకు నిర్మాత బండ్ల గణేష్ రూ.80 లక్షలు చీటింగ్ చేశాడంటూ ఫిర్యాదు చేయడం విదితమే.

ఫిర్యాదు అనంతరం కూడా తనను ముంబై మాఫియాతో చంపిస్తానని బెదిరిస్తున్నాడంటూ ధర్మచరణ్ మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు గణేష్‌పై చీటింగ్, బెదిరింపు కేసులు నమోదు చేసి, నోటీసు జారీ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement