14 ఏళ్లకే డిగ్రీ ఫైనల్ రాసిన నైనా జైస్వాల్ | nina jaiswal wrote degree final exams at 14 years | Sakshi
Sakshi News home page

14 ఏళ్లకే డిగ్రీ ఫైనల్ రాసిన నైనా జైస్వాల్

Mar 28 2014 2:21 AM | Updated on Sep 2 2017 5:15 AM

14 ఏళ్లకే డిగ్రీ ఫైనల్ రాసిన నైనా జైస్వాల్

14 ఏళ్లకే డిగ్రీ ఫైనల్ రాసిన నైనా జైస్వాల్

పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని విజయాలు సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ చదువులో కూడా రికార్డు సొంతం చేసుకున్నారు.

చదువులోను రికార్డు సాధించిన టీటీ క్రీడాకారిణి
 
 హైదరాబాద్, న్యూస్‌లైన్: పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని విజయాలు సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ చదువులో కూడా రికార్డు సొంతం చేసుకున్నారు. పద్నాలుగేళ్లకే డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు రాశారు. ఇక్కడి సీతాఫల్‌మండి వివేకానంద డిగ్రీ కళాశాల సెంటర్‌లో ఆమె ఈ పరీక్షలకు హాజరయ్యారు. నైనా బీఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సు చేస్తున్నారు. టేబుల్ టెన్నిస్‌తో పాటు తనకు జర్నలిజం అంటే ఇష్టమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తన తల్లిదండ్రులు అశ్విన్ జైస్వాల్, భాగ్యలక్ష్మి ప్రోత్సాహంతోనే అటు టీటీ, ఇటు చదువులో రాణిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిదేళ్లకే పదో తరగతి పరీక్షలు రాసిన తమ కుమార్తె ఆ పరీక్షలో ఏ గ్రేడ్ సాధించిందని నైనా తండ్రి అశ్విన్ తెలిపారు. అంతర్జాతీయ క్రీడాకారిణి నైనా తమ సెంటర్‌లో పరీక్షలు రాయడంపట్ల కళాశాల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement