ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌ | new cyber crime in social media | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌

Jul 16 2017 1:58 PM | Updated on Oct 22 2018 6:05 PM

ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌ - Sakshi

ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌

సోషల్‌ మీడియా నేరాల్లో మరో కొత్తకోణం వెలుగుచూసింది.

విశాఖపట్నం: సోషల్‌ మీడియా నేరాల్లో కొత్తకోణం వెలుగుచూసింది. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలా ద్వారా పరిచయమైన కొందరితో స్వలింగ సంపర్కం చేసి డబ్బుగుంజుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళ్తే నకిలీ ఫేస్‌బుక్‌​ఖాతాల ద్వారా ‘గే’’ గ్రూపులో పరిచయమైన ఐదుగురు యువకులు నగరానికే చెందిన మరో యువకుడితో స్వలింగ సంపర్కం చేశారు. ఆ తంతంగాన్ని చిత్రీకరించి అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేశారు. రూ. 2 లక్షలు ఇవ్వాలని లేకుంటే.. వీడియోను సామాజిక మాద్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తామని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలు పెట్టారు.

దీంతో కంగారు పడ్డ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం ప్రధాన నిందితుడు ముక్కాల ఆదిత్యతో పాటు మరో నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.36 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ కేంద్రంగా నడుస్తున్న ‘గే’ గ్రూపులో 2,335 మంది సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సామాజిక మాద్యమాల ద్వారా లైంగిక వేదింపులు ఎదుర్కొంటున్న వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని నగర పోలీస్‌ కమిషనర్‌ నాగేంద్రకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement