బాబోయ్‌.. బయోభూతం

Negligance on Hospitals Bio wastage - Sakshi

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చెత్తలో కలుస్తున్న ఆసుపత్రుల వ్యర్థాలు

నిబంధనల మేరకు విచ్ఛిన్నం చేయడంలో నిర్లక్ష్యం

కొద్దిపాటి మొత్తాలకు కూడా కక్కుర్తిపడుతున్న ఆస్పత్రులు

ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తున్న బయోవ్యర్థాలు

చోద్యం చూస్తున్న అధికారులు

ఆస్పత్రుల నుంచి వచ్చే బయో వ్యర్థాలనుప్రత్యేకంగా తరలించి ప్లాంటులో నిర్వీర్యంచేయాల్సి ఉండగా చాలావరకు నిబంధనలనుపాటించడం లేదు. పలు ఆసుపత్రుల నుంచిసేకరించిన వీటిని చెత్తతో కలిపి సాధారణడంపింగ్‌యార్డులకు తరలిస్తున్నారు. కాగా..ఈ ప్లాంటు మన జిల్లాలో లేకపోవడం..పొరుగున ఉన్న అనంతపురం జిల్లా ధర్మవరంమండలంలో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్నప్లాంటుకు వీటిని తరలించాల్సి ఉంది. కొన్నిప్రైవేటు ఆసుపత్రులు ఈ సంస్థతో ఒప్పందంచేసుకోకపోవడంతో.. ఒప్పందంలో ఉన్నఆసుపత్రులూ ఈ కార్యక్రమాన్ని సరిగాచేపట్టక పోవడంతో పాటు వ్యర్థాలనుఎక్కడంటే అక్కడ చెత్తలో పడేస్తున్నారు.జనాలను రోగాల పాల్జేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ ప్రమాదకరంగా మారుతోంది. వ్యర్థాలను నిబంధనల ప్రకారం నిర్వీర్యం చేయాల్సి ఉన్నా పలు చోట్ల ఈ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. దీంతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. రోగులకు వినియోగించిన సిరంజీలు, బ్యాండేజీలు, బ్లేడ్లు, ఐవీసెట్లు ఇతర వ్యర్థ పరికరాల ద్వారా ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. నిబంధనల ప్రకారం ఈ వ్యర్థాలను కేటాయించిన డబ్బాల్లో వేరుచేసి ప్రత్యేక ప్లాంటుకు తరలించి నీడిల్‌ బర్నల్‌ ద్వారా కరిగించి విచ్ఛిన్నం చేయాల్సి ఉంది. 

రోజూ 2 టన్నులు..
జిల్లాలో రిమ్స్, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి, పులివెందులలో ఏరియా ఆసుపత్రి, సీఎం ఆరోగ్య కేంద్రాలు 11, పీహెచ్‌సీలు 75, సీహెచ్‌సీలు 12ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో సుమారు 300లకు పైగా ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 1,500 మంది ఆర్‌ఎంపీ, ఇతరులు (ప్రథమ చికిత్స చేయగలిగిన వారు) సేవలందిస్తున్నారు. అధికసంఖ్యలో ల్యాబ్‌లూ ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల నుంచి నిత్యం సుమారు 2టన్నులకు పైగా బయోవ్యర్థాలు వస్తుంటాయని అంచనా. వాటిని కేటగిరీలుగా విభజించి ప్రత్యేకంగా కేటాయించిన డబ్బాల్లో వేయాలి.

నిబంధనలు పాటించని ఆసుపత్రులు
జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి ఉన్న ఆసుపత్రులు 181 ఉండగా.. మిగిలినవి అన«ధికారికంగా కొనసాగుతున్నాయి. వీటిలో అధిక శాతం ఆసుపత్రులు నిబంధనలు పాటించడం లేదు. వ్యర్థాలను వేరుచేయడం లేదు. పలుచోట్ల రంగుల డబ్బాలను కూడా పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. దీంతోపాటు కొన్నిచోట్ల వీటిని అట్ట పెట్టెల్లో వేస్తున్నారు. ఫలితంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదమున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. గ్రామాల్లో వినియోగించిన బయో వ్యర్థాలను అక్కడే చెత్తలో పడేస్తున్నారు. ఈ పరిణామం ప్రమాదకరంగా మారుతోంది.

నిర్వీర్యం చేసేది కొంతే?
ఆసుపత్రుల్లో వ్యర్థాలను సూచించిన రంగుల డబ్బాల్లో వేసి నిబంధనల ప్రకారం వీటిని నీడిల్‌ బర్నల్‌లో కరిగించాలి. శ్రీవెన్‌ ఎన్విరాన్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలం దంపెట్ల వద్ద ఈ వ్యర్థాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ఉంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ అయిన ఆసుపత్రుల నుంచి మంచానికి రూ.3.50 నుంచి రూ.4.50 వరకు రోజుకు వసూలు చేస్తారు. వాస్తవంగా 48గంటలకు మించి వైద్యశాలల్లో వ్యర్థాలను ఉంచకూడదు. కానీ పలుచోట్ల రోజుల తరబడి వీటిని సేకరించడం లేదు. దీంతో వ్యర్థాల నిల్వ పేరుకుపోవడంతో వీటిని పక్కనే ఉన్న డంపింగ్‌ డబ్బాల్లో సిబ్బంది పడేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు వీటిని కూడా కడప శివారుల్లోని మద్దిమడుగు డంపింగ్‌యార్డుకు తరలించి తగులబెడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఈ విషయంలో కఠిన చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో భారీసంఖ్యలో ఆసుపత్రులు ఉండగా రోజుకు కేవలం 429 కేజీల వ్యర్థాలు వస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు.

నిబంధనలు ఇవి..
ఎరుపురంగు డబ్బాలో గ్లవ్స్, ప్లాస్టిక్‌ గొట్టాలు, సీసాలు, సెలైన్‌ సీసాలు, ఐవీ సెట్లు, మూత్రసంచులు, సూదులు లే ని సిరంజీలు, ట్యూబ్‌లు వ్యర్థాలు వేయాలి.
పసుపు రంగు డబ్బాలో దూది, డ్రస్సింగ్, పిండికట్టు వ్యర్థాలు, గాజు వస్త్రం, శరీర ద్రవాలు, భాగాలు, అవయవాలు, నమూనాలు, మానవ కణజాలాలు, సూక్ష్మ క్రిమి వ్యర్థాలు, నెత్తురు, చీము, రక్త సంచులు, గడువు ముగిసిన మందులు, టీకాలు వంటి వాటిని వేయాలి.
నీలం రంగు డబ్బాలో గాజు సీసాలు, ఇంప్లాట్లు, ప్రూఫ్‌ కంటైనర్లలో సూదులు, సిరంజీలు, కత్తిరించిన సూదులు వంటి వ్యర్థాలను వేర్వేరుగా వేయాలి.

వ్యర్థాల విచ్ఛిన్నానికి చర్యలు..
ఆసుపత్రి వ్యర్థాలను సేకరించి విచ్ఛిన్నం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి సేకరించి ప్లాంటుకు తరలించే విధంగా ఏర్పాట్లు చేశాం. మంచాల(బెడ్స్‌) ప్రాతిపదికన సొమ్ము తీసుకుని వ్యర్థాలను సేకరిస్తున్నారు. అసుపత్రి వ్యర్థాలు చెత్తలో కలుస్తుండడం, దీనిని డంపింగ్‌ యార్డులకు తరలిస్తుండడాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. జిల్లాలో అథరైజేషన్‌ చేయించుకోని 13 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశాం. – నరేంద్రబాబు, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి, తిరుపతి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top