టెస్సీ థామస్, గీతా వరదన్‌లకు నాయుడమ్మ పురస్కారం | nayudamma award is presented to tessy thamas and gita varadan | Sakshi
Sakshi News home page

టెస్సీ థామస్, గీతా వరదన్‌లకు నాయుడమ్మ పురస్కారం

Mar 1 2015 7:55 PM | Updated on Sep 2 2017 10:08 PM

టెస్సీ థామస్, గీతా వరదన్‌లకు నాయుడమ్మ పురస్కారం

టెస్సీ థామస్, గీతా వరదన్‌లకు నాయుడమ్మ పురస్కారం

క్షిపణి మహిళగా ఖ్యాతి గడించిన అగ్ని ప్రాజెక్ట్ తొలి మహిళా డైరెక్టర్ టెస్సీ థామస్, ఇస్రో అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(అడ్రిన్) తొలి మహిళా డైరెక్టర్ గీతా వరదన్ ప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డును సంయుక్తంగా అందుకున్నారు.

గుంటూరు: క్షిపణి మహిళగా ఖ్యాతి గడించిన అగ్ని ప్రాజెక్ట్ తొలి మహిళా డైరెక్టర్ టెస్సీ థామస్, ఇస్రో అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(అడ్రిన్) తొలి మహిళా  డైరెక్టర్ గీతా వరదన్ ప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డును సంయుక్తంగా అందుకున్నారు. తెనాలి బోస్ రోడ్డులోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళాసదనంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా అవార్డును వారిరువురికీ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ వై.నాయుడమ్మ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఆర్.సంపత్ అధ్యక్షత వహించారు. మేనేజింగ్‌ట్రస్టీ పి.విష్ణుమూర్తి, డాక్టర్ నాయుడమ్మ మనుమరాలు అంజన నాని, మాదల సుధాకర్, ఎస్.సూర్యమోహన్, కె.బలహరనాథ్ మూర్తి, ఆర్.శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
(తెనాలి రూరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement