రెండేళ్లలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పూర్తి.. | MP Raghu Rama Krishnam Raju Said Water Grid Project Would Be Completed In Two Years | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పూర్తి..

Jan 17 2020 1:19 PM | Updated on Jan 17 2020 1:35 PM

MP Raghu Rama Krishnam Raju Said Water Grid Project Would Be Completed In Two Years - Sakshi

సాక్షి, నరసాపురం: జిల్లాలో గోదావరి చెంత నుంచి శుద్ధి చేసిన జలాలను పైపులైన్‌ ద్వారా సరఫరా చేసేందుకు ప్రణాళిక ఆమోదం పొందిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 3,670 కోట్లతో ఈ పథకం చేపడుతున్నట్లు తెలిపారు.  ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసిందని చెప్పారు.  వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తోన్న పశ్చిమగోదావరి జిల్లా ప్రజల కల నిజం కాబోతుందని.. రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతికి ఇచ్చిన కానుక అని పేర్కొన్నారు. వాటర్‌ సప్లైకి ప్రతి ఇంటికి మీటర్‌ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement