‘తండ్రే పిల్లలను ఇలా హింసించడం బాధాకరం’ | Minister Taneti Vanita Reacted On Narsapuram Incident That Father Hits His Two Children | Sakshi
Sakshi News home page

పిల్లలను హింసించిన ఘటనపై స్పందించిన మంత్రి

Nov 12 2019 6:27 PM | Updated on Nov 12 2019 7:44 PM

Minister Taneti Vanita Reacted On Narsapuram Incident That Father Hits His Two Children - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: భార్య మీద కోపంతో పిల్లలను చితకొట్టి హింసించిన ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. నరసాపురం ఘటన తనను కలచివేసిందని, తండ్రే పిల్లలను ఇలా హింసించడం బాధాకరం అన్నారు. బాధిత చిన్నారులను పరామర్శించిన మంత్రి అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తల్లి వచ్చేవరకు చిన్నారులిద్దరిని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించి వారి సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. చిన్నారులను హింసించిన కసాయి తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి అదేశించారు. ఇటువంటి ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, పిల్లలిద్దరిని తణుకు బాలసదనంలో చేర్పించి చదివిస్తామని మంత్రి పేర్కొన్నారు.(చదవండి: గల్ఫ్‌లో ఉన్న భార్యపై కోపంతో దారుణం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement