
తూర్పుగోదావరి జిల్లా: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో భయంకరమైన రాజకీయాలు చూడాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. కూటమి ప్రభుత్వంలో కేవలం కక్ష సాధింపు రాజకీయాలే కనబడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగటం లేదని ధ్వజమెత్తారు. ‘టిడిపి ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి వయసుకు తగ్గ మాటలు మాట్లాడటం లేదు. మాజీ ముఖ్యమంత్రి పై విమర్శలు చేసిన బుచ్చయ్య చౌదరిపై కేసులు ఉండవు. వాళ్లు మాట్లాడిన మాటలకు ఎటువంటి సెక్షన్లు వర్తించవు.
వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు మాట్లాడితే మాత్రం వెంటనే ఎక్కడ లేని సెక్షన్లు పుట్టుకొచ్చే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఓ అభిమాని ప్లకార్డు ప్రదర్శించిన దాని గురించి మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ లు పెట్టి టిడిపి నేతలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోవాస్తవాలను వాస్తవాలుగా చూపించడం ,తప్పు జరిగిన చోట ఖండించడం జరగడం లేదు. పల్నాడు ఘటనలో ఎస్పీ ప్రెస్ మీట్ లో ముందు ఒకలా మాట్లాడారు.. ఈరోజు ఎస్పీని మ్యాను ప్లేట్ చేశారు.సెక్షన్లు మార్చేసి వాళ్లకు ఇష్టం వచ్చినట్లు చేయాలని చూస్తున్నారు. జగనన్న ఎక్కడికి వెళ్ళినా జన సందోహం స్వచ్ఛందంగా వస్తున్నారు... అది చూసి నేతల తట్టుకోలేకపోతున్నారు.కూటమినేతలుచెప్పిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నమ్మి ఓట్లేసి మోసపోయామని ప్రజలకు కుమిలిపోతున్నారు.
ప్రతి కుటుంబంలో కూడా జగనన్నను గుర్తుచేసుకోని వారు ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ రాజకీయం కోసం మా మీద బురద చల్లడం కోసం మహిళలు మిస్ అయ్యారు అని అన్నారు. వాలంటీర్లకు 5000 ఏం సరిపోతాయి మీ పొట్టను కొట్టను అన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరీపొట్ట కొట్టాడు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం లో దళితులు వెలివేతకు గురైతే కనీసం స్పందించలేదు. ప్రశ్నించే గొంతుకు అన్నారు కదా ఆ గొంతుక ఇప్పుడు ఏమైంది...?’ అని ప్రశ్నించారు తానేటి వనిత.