పరిగి మండలం కొడిగెనహళ్లిలో శశికళ (25)అనే వివాహిత కిరోసిన్ పోసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది.
పరిగి: పరిగి మండలం కొడిగెనహళ్లిలో శశికళ (25)అనే వివాహిత కిరోసిన్ పోసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి చెల్లెలు ఇంట్లో చెప్పకుండా ఎక్కడికో వెళ్లి పోయిందన్నారు. దాంతో తమ తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చిందని మనస్తాపంతో ఇంట్లో ఎవ్వరులేని సమయంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిందన్నారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.