నేను సీఎం కావాలంటున్నారు: సర్వే సత్యనారాయణ | Many People wants, I'm in CM Chair: Survey Satyanarayana | Sakshi
Sakshi News home page

నేను సీఎం కావాలంటున్నారు: సర్వే సత్యనారాయణ

Sep 13 2013 1:51 AM | Updated on Sep 1 2017 10:39 PM

‘నేను ముఖ్యమంత్రిని కావాలని చాలామంది అంటున్నారు. సీఎం పదవి చెట్టుమీదున్న పిట్ట, కేంద్ర మంత్రి పదవి చేతిలోనున్న పిట్ట.

సాక్షి, హైదరాబాద్: ‘‘నేను ముఖ్యమంత్రిని కావాలని చాలామంది అంటున్నారు. సీఎం పదవి చెట్టుమీదున్న పిట్ట, కేంద్ర మంత్రి పదవి చేతిలోనున్న పిట్ట. చెట్టు మీద ఉన్న పిట్ట కోసం ఆరాటపడితే చేతిలో ఉన్న పిట్ట తుర్రుమనే అవకాశం ఉంది’’ అని  కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఎక్స్‌పో టెల్ హోటల్లో గురువారం క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ 26వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న రాష్ట్రాలుంటేనే పరిపాలన, ప్రజలు బాగుంటారని తెలిపారు. హైదరాబాద్ ఎవరి జాగీర్ కాదని, ఎవరైనా ఎక్కడైనా ఉండవచ్చని చెప్పారు. హెచ్‌ఎంటీ కంపెనీకి రూ.8.50 కోట్ల ప్యాకేజీను కేంద్రం నుంచి మంజూరు చేయించానని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement