అడ్డుగా ఉందని.. హతమార్చాడు | Man Strangled wife in Guntur district | Sakshi
Sakshi News home page

అడ్డుగా ఉందని.. హతమార్చాడు

Apr 15 2015 3:05 PM | Updated on Jul 28 2018 8:40 PM

అడ్డుగా ఉందని.. హతమార్చాడు - Sakshi

అడ్డుగా ఉందని.. హతమార్చాడు

అడ్డు తొలిగించుకునేందుకు భార్య గొంతు నులిమి చంపేశాడో భర్త. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని పత్తిపాడు మండలం పాతలమల్లాయపాలెంలో బుధవారం వెలుగుచూసింది.

గుంటూరు(పత్తిపాడు): అడ్డు తొలగించుకునేందుకు భార్య గొంతు నులిమి చంపేశాడో భర్త. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని పత్తిపాడు మండలం పాతలమల్లాయపాలెంలో బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గతంలో జయ అనే మహిళను ఏసు అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అత్యాచారం కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం భర్త ఏసు భార్య జయ అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలనుకున్నాడు.

అయితే దంపతులు ఏసు, జయ కర్నూలు జిల్లా పల్లవాడు గ్రామంలో నివాసముంటున్నారు. పథకం ప్రకారం.. ఏసు తన భార్యను వారం క్రితం మిర్చి కోతల కోసం పాతమల్లాయపాలెం తీసుకవెళ్లాడు. అనుకున్నట్టుగానే అక్కడే భార్య గొంతునులిమి హతమార్చినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement