వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం బజ్జువారిపల్లె పంచాయతీ బంగ్లామిట్ట సమీపంలో ఒక యువకుడిని గొంతు కోసి హతమార్చారు.
గొంతు కోసి యువకుడి హత్య
Jan 18 2016 12:02 PM | Updated on Jul 30 2018 8:29 PM
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం బజ్జువారిపల్లె పంచాయతీ బంగ్లామిట్ట సమీపంలో ఒక యువకుడిని గొంతు కోసి హతమార్చారు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. రామయ్యపాళెం ఎస్టీ కాలనీకి చెందిన పెంచలసుబ్రమణ్యం(22) ఆదివారం సాయంత్రం బంగ్లామిట్టలో జరిగిన జాతరకు వచ్చాడు.
జాతర అనంతరం బైక్‌పై వెళుతున్నసుబ్రమణ్యంను కత్తులతో గొంతుకోసి బైక్‌పైనే శవాన్ని వదిలేసి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement