విద్యుత్ తీగలకు ఓ వ్యక్తి బలయ్యూడు. సోమవారం అర్ధరాత్రి విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు
పాచిపెంట : విద్యుత్ తీగలకు ఓ వ్యక్తి బలయ్యూడు. సోమవారం అర్ధరాత్రి విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. పాచిపెంట ఎస్సీ కాలనీకి చెందిన రావాడ నాగార్జున (22) ఎలక్ట్రీషియన్ పనులు చేస్తుంటాడు. తండ్రి అనారోగ్యంతో మంచాన పడడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్నాడు.
సోమవారం అర్ధరాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలో విద్యుత్ తీగలు సరిచేస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రాజ్యలక్ష్మి ప్రస్తుతం గర్భవతి. ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నారు. మృతి వార్త తెలియగానే నాగార్జున కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. రాజ్యలక్ష్మి రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. ఇక తమకు దిక్కెవరని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. వారిని ఆపడం ఎవరి తరం కాలేదు. ఎస్‌ఐ జి.డి.బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే రాజన్నదొర ఓదార్పు
మృతి వార్త తెలియగానే ఎమ్మెల్యే రాజన్నదొర సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబానికి రూ. 10 లక్షలు నష్టపరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంబంధిత సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీరు పర్యవేక్షణ లేకపోవడం వల్ల దిగువ స్థాయి సిబ్బంది పనితీరు బాగోలేదన్నారు. సంఘటన స్థలానికి డీఈ స్థాయి అధికారి రాకపోవడం నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందన్నారు. ఇందుకు కారణమైన అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తానని చెప్పారు. ఆయనతో వైస్ ఎంపీపీ టి.గౌరీశ్వరరావు, ైవె ఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి డోల బాబ్జీ, సలాది అప్పలనాయుడు, ఇజ్జాడ తిరుపతి, సీపీఎం నాయకుడు కోరాడ ఈశ్వరరావు ఉన్నారు.