ఈ నెల 30న ఎమ్మెస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్ | M.Sc Nursing counselling will be start from 30th December | Sakshi
Sakshi News home page

ఈ నెల 30న ఎమ్మెస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్

Dec 22 2015 8:15 PM | Updated on Sep 3 2017 2:24 PM

తిరుపతి శ్రీ పద్మావతమ్మ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలోని ఎమ్మెస్సీ నర్సింగ్ సీట్లకు ఈ నెల 30న విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు.

విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : తిరుపతి శ్రీ పద్మావతమ్మ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలోని ఎమ్మెస్సీ నర్సింగ్ సీట్లకు ఈ నెల 30న విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఏడాది ఆగస్టు 16న యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అర్హులని చెప్పారు.

సీట్ మ్యాట్రిక్స్ వివరాలు కౌన్సెలింగ్‌కు ముందురోజు యూనివర్సిటీ నోటీసు బోర్డుతో పాటు వర్సిటీ (http://ntruhs.ap.nic.in) వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు వివరించారు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 2 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 1500 చొప్పున చెల్లించి ఈ 30వ తేదీ ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు రూ. 9,700 యూనివర్సిటీ ఫీజు చెల్లించాలని చెప్పారు. మరిన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement