ప్రజా విశ్వాసం కోల్పోతున్న టీడీపీ ప్రభుత్వం | loss of public confidence in the Government TDP | Sakshi
Sakshi News home page

ప్రజా విశ్వాసం కోల్పోతున్న టీడీపీ ప్రభుత్వం

Jul 6 2015 12:52 AM | Updated on Mar 9 2019 3:05 PM

ప్రజా విశ్వాసం కోల్పోతున్న టీడీపీ ప్రభుత్వం - Sakshi

ప్రజా విశ్వాసం కోల్పోతున్న టీడీపీ ప్రభుత్వం

తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానాల ఊబిలో చిక్కుకుని నానాటికీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోందని పార్టీ జాతీయ అధ్యక్షుడు ...

లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు కఠారి
 
భవానీపురం : తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానాల ఊబిలో చిక్కుకుని నానాటికీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోందని పార్టీ జాతీయ అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు విమర్శిం చారు. బెంజిసర్కిల్ వద్ద గల వేదిక హాల్‌లో ఆదివారం జరిగిన రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆ యన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. లోక్‌సత్తా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటానికి తగిన ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ, జాతీయ నాయకులు రవిమారుతి, జె.వెంకటేశ్వర్లు తమ సందేశాలను అందించారు. రాజకీయ అంశాలపై రాష్ర్ట ఉపాధ్యక్షుడు నర్రా శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి ఐ.రామమూర్తి, ప్రజా సమస్యలపై ప్రత్యక్ష కార్యాచరణ కార్యక్రమంపై రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెన్నుపాటి వజీర్, పార్టీ సంస్థాగత అంశాలను ప్రధాన కార్యదర్శి రమేష్‌రెడ్డి ప్రతిపాదించారు. ప్రభుత్వ మద్యం పాలసీపై రాష్ర్ట నాయకులు మనోరమ, పద్మారాణి ప్రవేశపెట్టగా, విభజన హామీలపై తీర్మానాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓంకార్, వెంకటేశ్వరరావు ప్రతిపాదించగా, అవినీతి వ్యతిరేక తీర్మానాన్ని ఎస్.నరేంద్ర, ఎం.వెంకటేశ్వరరావులు ప్రతిపాదించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement