రాజధాని ప్రాంత గ్రామాల్లోని సీఆర్‌డీఏ కార్యాలయాల్లోని రైతుల అంగీకార పత్రాలు, ఇతర ముఖ్య డాక్యుమెంట్లను అధికారులు సోమవారం విజయవాడలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
విజయవాడ: రాజధాని ప్రాంత గ్రామాల్లోని సీఆర్‌డీఏ కార్యాలయాల్లోని రైతుల అంగీకార పత్రాలు, ఇతర ముఖ్య డాక్యుమెంట్లను అధికారులు సోమవారం విజయవాడలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయానికి తరలించారు. భూ ఒప్పంద పత్రాలు ఇచ్చిన రైతుల్లో కొందరు వాటిని వెనక్కి ఇచ్చేయాలని ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సీఆర్‌డీఏ ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టింది. మరోవైపు గ్రామాల్లోని సీఆర్‌డీఏ కార్యాలయాలకు సోమవారం నుంచి భద్రత పెంచారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న రైతులు, కూలీల నుంచి ఇబ్బందులు వస్తాయనే ఉద్ధేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.