ఓ దుకాణంలో చొరబడిన ఆరుగురు మహిళలు తమ హస్తలాఘవంతో వస్త్రాలు కాజేశారు.
దుస్తులు చోరీ చేసిన నలుగురు మహిళలు
పరారవుతూ దొరికారు
రాజాం: ఓ దుకాణంలో చొరబడిన ఆరుగురు మహిళలు తమ హస్తలాఘవంతో వస్త్రాలు కాజేశారు. అంతే చాకచక్యంగా తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. చివరి క్షణంలో దుకాణ సిబ్బంది వచ్చి పట్టుకున్నారు. వివరాలివీ... స్థానిక పాలకొండ రోడ్డులోని వస్త్ర దుకాణంలో మంగళవారం నలుగురు మహిళలు మూడు బృందాలుగా విడిపోయి వెళ్లారు. కొనుగోలు దారుల్లా వ్యవహరిస్తూ చీరలు, రడీమెడ్ దుస్తులు పరిశీలించారు. అందులో ఓ వృద్ధురాలు ఒక్కొక్కటిగా బయటకు చేర్చి మూట కట్టి పరారైంది. ఆమె ఆ మూట పట్టుకొని ఏరియా ఆస్పత్రి వరకూ నడుచుకుంటూ చేరుకుంది. ఇంతలో మిగిలిన సభ్యులు ఆటోలో వచ్చి ఆమె పక్కనే ఆపారు. మూటను ఆటోలో పెట్టి ఆమెనూ ఎక్కమని సైగ చేశారు. దుకాణంలో సుమారు రూ.20 వేల విలువైన వస్త్రాల చోరీ జరిగినట్లు గుర్తించిన దుకాణం సిబ్బంది వెంటనే వారిని అనుసరించారు. ఆటోలో పరారైపోతున్న సమయంలో నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ నిమిత్తం నిందితులను స్టేషన్‌కు తరలించామని, దర్యాప్తు చేస్తున్నామని సీఐ శంకరరావు తెలిపారు.