ముఖ్యమంత్రి లాస్ట్బాల్ బూమెరాంగ్ | kiran kumar reddy last ball boomerangs | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి లాస్ట్బాల్ బూమెరాంగ్

Jan 25 2014 3:55 PM | Updated on Jul 29 2019 5:31 PM

ముఖ్యమంత్రి లాస్ట్బాల్ బూమెరాంగ్ - Sakshi

ముఖ్యమంత్రి లాస్ట్బాల్ బూమెరాంగ్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇన్నాళ్లుగా లాస్ట్బాల్ అంటూ ఊరించిన వ్యూహం కాస్తా బూమెరాంగ్ అయ్యింది. సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు.. చీఫ్ విప్ కూడా ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో తిరగబడ్డారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇన్నాళ్లుగా లాస్ట్బాల్ అంటూ ఊరించిన వ్యూహం కాస్తా బూమెరాంగ్ అయ్యింది. సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు.. చీఫ్ విప్ కూడా ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో తిరగబడ్డారు. రాష్ట్ర విభజన బిల్లు అంతా తప్పులు తడకలుగా ఉన్నందున దాన్ని రాష్ట్రపతికి తిప్పి పంపాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు ఇచ్చారు. అసెంబ్లీ రూల్ 77 కింద విభజన బిల్లును తిప్పి పంపాలని ఆయన కోరారు.

అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. స్వయంగా చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ముఖ్యమంత్రిపై తాము విశ్వాసం కోల్పోయామని తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు విపక్షనేత చంద్రబాబు కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, విభజన బిల్లులో తప్పులున్నాయన్న పేరుతో వాటిని వెనక్కి పంపాలని చెప్పడం సరికాదన్నారు. ఇన్నాళ్లు దీని గురించి ఎందుకు మాట్లాడలేదని, ఇప్పుడు విభజన బిల్లు వెనక్కి పంపాలని సీఎం స్పీకర్‌కు లేఖ రాయడం ఏకపక్ష నిర్ణయమని ఆయన చెప్పారు. ఆయన వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, సీఎంపై విశ్వాసం కోల్పోయామని గవర్నర్‌ను కలిసేందుకు తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులమంతా చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. పనిలో పనిగా గండ్ర వెంకట రమణారెడ్డితో పాటు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లు కేటీఆర్, ఈటెల రాజేందర్ గవర్నర్ నరసింహన్ను కూడా కలవాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement