 
															భయపడి 'సీఎం రచ్చబండ' వాయిదా వేయలేదు
మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం వాయిదా పడింది.
	హైదరాబాద్ : మెదక్ జిల్లాలో  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం వాయిదా పడింది. ఆదిలాబాద్లో తెలంగాణ సభ ఉన్నందునే మెదక్లో రచ్చబండ వాయిదా వేసినట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి మంగళవారమిక్కడ తెలిపారు. అయితే టీఆర్ఎస్, జేఏసీ బెదిరింపులకు భయపడి  కార్యక్రమాన్ని వాయిదా వేయలేదని ఆయన స్పష్టం చేశారు. రచ్చబండ వాయిదా వేసుకోమని తెలంగాణ మంత్రులు కోరినట్లు ఆయన తెలిపారు. కాగా త్వరలోనే ముఖ్యమంత్రితో మెదక్లో సభ పెడతామని జగ్గారెడ్డి తెలిపారు.
	
	 కాగా సంగారెడ్డిలో ‘రచ్చబండ’ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది.  రచ్చబండ కార్యాక్రమంలో  పార్టీ నేతలెవరూ పాల్గొనరాదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  సీఎం పాల్గొనే రచ్చబండను బహిష్కరిస్తున్నట్టు జిల్లా కాంగ్రెస్ కమిటీ స్పష్టం చేయగా, టీఆర్‌ఎస్ ఆ రోజు ఏకంగా జిల్లాబంద్‌కు పిలుపునిచ్చింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
