నాలుగు రోజులు తాగునీటి సరఫరా లేకపోవడంతో వారు నానా అగచాట్లు పడ్డారు. ఇదేమీ పట్టనట్లున్న అధికారుల తీరుపై ఆవేదన ఆక్రోషం పెల్లుబికారుు.
అట్లూరు: నాలుగు రోజులు తాగునీటి సరఫరా లేకపోవడంతో వారు నానా అగచాట్లు పడ్డారు. ఇదేమీ పట్టనట్లున్న అధికారుల తీరుపై ఆవేదన ఆక్రోషం పెల్లుబికారుు. విన్నపాలకు వినని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఎమ్పీడీఓ కార్యాలయూనికి తాళం వేసి తమ ఆవేదనను తెలియజెప్పారు. మండల కేంద్రమైన అట్లూరు గ్రామస్థులు మంగళవారం ఖాళీ బిందెలతో వచ్చి ఎంపిడిఓ కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం అక్కడే నిలబడి ఆందోళన చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈసంధర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్తు బిల్లులు చెల్లించలేదంటూ నాలుగు రోజుల క్రితం ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్తు మోటార్లకు సరపరా నిలిపి వేశారన్నారు.
ఫలితంగా తాగునీటి సరఫరా ఆగిపోరుుంది. దీనిపై ఇంతవరకూ ప్రజా ప్రతినిధులు గాని అధికారులుగానీ పట్టించుకున్న పాపానపోలేదన్నారు. తాగు నీటికోసం అల్లాడుతున్నా ఎవరూ స్పందించలేదన్నారు. గత్యంతరంలేక ఎంపిడిఓ కార్యలయానికి తాళం వేసి ఇలా నిరసన తెలిపామన్నారు. ఆ సమయంలో ఎంపిడిఓ మధుసూధన్‌రెడ్డి కలెక్టరు కార్యాలయంలో సమావేశానికి హాజరయ్యేందుకు కడపకు వెళ్లడంతో ఆందోళనకారులు అక్కడి నుంచి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి తహసిల్దారు మాధవకృష్ణారెడ్డికి సమస్యను వివరించారు. స్పందించిన ఆయన ఎంపిడిఓతో పాటు ఉన్నత అధికారులకు తాగునీటి సమస్య తెలియ జేశారు. ఎంపిడిఓ మధుసూదన్‌రెడ్డి జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ట్రాన్సుకో ఎస్‌ఈతో చర్చించి సత్వరం విద్యుత్తు సరఫరా పునఃరుద్దరించాలని సూచించారు. ఈ మేరకు ఎంపిడిఓ ఫోన్‌లో తెలపడంతో ఆందోళన విరమించారు.