కర్నూల్‌ పీఎస్‌లో ముగిసిన జేసీ విచారణ | JC Prabhakar Reddy Investigation Is Over In Kurnool Police Station | Sakshi
Sakshi News home page

రెండున్నర గంటలపాటు జేసీని విచారించిన పోలీసులు

Jul 17 2020 6:36 PM | Updated on Jul 17 2020 7:00 PM

JC Prabhakar Reddy Investigation Is Over In Kurnool Police Station - Sakshi

కర్నూలు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండున్నర గంటల పాటు జేసీని పోలీసులు విచారించారు.

సాక్షి, కర్నూల్‌: జిల్లాలోని రూరల్‌ పోలీసు స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి విచారణ శుక్రవారం ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు జేసీని పోలీసులు విచారించారు. అదే విధంగా ఓర్వకల్లు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులపై కూడా పోలీసులు విచారించారు.

తప్పుడు పత్రాలతో 3 లారీల విక్రయాలపై ఓర్వకల్లు పోలీసుల స్టేషన్‌లో జేసీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. వాహనాలను చవ్వా గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి డ్రైవర్‌ నాగన్న పేరు మీద నకిలీ చిరునామాతో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు పోలీసులు గర్తించారు. ఇక విచారణ అనంతరం జేసీ ప్రభాకర్‌రెడ్డిని తిరిగి కడప సెంట్రల్‌ జేలు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

చదవండి: నేరం అంగీకరించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి!

Advertisement
 
Advertisement
Advertisement