సుద్దాల, గోరటికి జాలాది పురస్కారం | Jaladi Awards for suddhalala Ashokateja and Gorati Venkanna | Sakshi
Sakshi News home page

సుద్దాల, గోరటికి జాలాది పురస్కారం

Aug 10 2017 3:34 AM | Updated on Sep 17 2017 5:21 PM

సుద్దాల, గోరటికి జాలాది పురస్కారం

సుద్దాల, గోరటికి జాలాది పురస్కారం

జాలాది రచనలు అద్భుతం, అనితరసాధ్యమని ప్రముఖ సినీరచయిత సుద్దాల అశోక్‌తేజ కొనియాడారు.

విశాఖ కల్చరల్‌: జాలాది రచనలు అద్భుతం, అనితరసాధ్యమని ప్రముఖ సినీరచయిత సుద్దాల అశోక్‌తేజ కొనియాడారు. సుప్రసిద్ధ సినీగేయ రచయిత, రంగస్థల ప్రయోక్త డాక్టర్‌ జాలాది రాజారావు 86వ జయంతి వేడుక సిరిపురం వుడా చిల్డ్రన్స్‌ థియేటర్‌లో బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు.

కార్యక్రమంలో సుద్దాల అశోక్‌తేజ, ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్నలకు జాలాది పురస్కారాలను ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, జాలాది ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు జాలాది విజయ తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా సుద్దాల మాట్లాడుతూ జాలాది, కొసరాజులు సినీజగత్తులో రారాజులని, వారి స్ఫూర్తితోనే 23 సంవత్సరాలుగా రచనలు చేస్తున్నట్లు తెలిపారు. గోరటి వెంకన్న మాట్లాడుతూ జాలాదిని తమిళంలో భైరవమూర్తితో పోల్చారు.

Advertisement
 
Advertisement
Advertisement