ఇది సర్కారు ‘కిక్’! | It is amongst the 'kick'! | Sakshi
Sakshi News home page

ఇది సర్కారు ‘కిక్’!

Aug 2 2014 2:24 AM | Updated on Sep 2 2017 11:14 AM

ఇది సర్కారు ‘కిక్’!

ఇది సర్కారు ‘కిక్’!

జిల్లాలో 94 చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు జారీ అయిన వెంటనే ఈ దుకాణాలకు తెరవాలని ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

  •     త్వరలో 94చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాలు
  •      అనుమతివ్వడమే తరువాయి
  •      గాజువాక, అనకాపల్లి పరిధిలో
  •      ఎక్సయిజ్ శాఖ సన్నాహాలు
  • విశాఖపట్నం : జిల్లాలో 94 చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు జారీ అయిన వెంటనే ఈ దుకాణాలకు తెరవాలని ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అనకాపల్లి, గాజువాక పరిధిలోనే ఈ దుకాణాలు ఉండడంతో త్వరలోనే వీటిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగో విడత మద్యం దుకాణాల ఏర్పాటుకు 97 చోట్ల దరఖాస్తులు ఆహ్వానిస్తే ముగ్గురే ముందుకొచ్చారు.

    దీంతో శుక్రవారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ నర్సింహారావు సమక్షంలో ఆ ముగ్గురికీ దుకాణాలను కేటాయించారు. 94 మద్యం దుకాణాలకు ఒక్కరూ ముందుకు రాలేదు. ఖాళీగా ఉన్న 94 చోట్ల ప్రభుత్వ మద్యం ఔట్‌లెట్లు పెట్టేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement