
ఇదేనా ప్రజాస్వామ్యం ?
మదనపల్లె నియోజకవర్గంలో స్థాని క సంస్థల్లో అధికారం కోసం తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. అధికార టీడీ పీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుం డా పోతోంది.
మదనపల్లె: మదనపల్లె నియోజకవర్గంలో స్థాని క సంస్థల్లో అధికారం కోసం తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. అధికార టీడీ పీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుం డా పోతోంది. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అడ్డదారిలో కైవసం చెసుకున్న ఆ పార్టీ ఎంపీపీలను కూడా సొంతం చేసుకునేందుకు కుటిల రాజకీయాలకు పాల్పడుతోంది. శుక్రవారం మదనపల్లె ఎంపీపీ ఎన్నిక విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులపై దౌర్జన్యాలకు దిగి భంగపడ్డ టీడీపీ నాయకులు కనీసం నిమ్మనపల్లి ఎంపీపీ పీఠాన్ని అయినా దక్కించుకోవాలన్న దురాశతో అడ్డదారుల్లో ముందుకెళుతున్నారు.
నిమ్మనపల్లె మండలంలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో ఐదు స్థానాలను వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ కైవసం చేసుకోగా, నాలుగు స్థానాలను టీడీపీ గెలుచుకుంది. స్పష్టమైన మెజారిటీ ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోకూడదన్న నెపంతో కొండయ్యగారి పల్లె ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున పోటీచేసి గెలుపొందిన హాజీరాంబీని టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేశారు. శుక్రవారం ఎన్నిక జరుగుతుండగా ఆమెకు అనారోగ్యంగా ఉందని చెప్పి మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో చేరేలా చేశారు. ఆస్పత్రిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
శనివారం తన ఆరోగ్యం కుదుటపడిందనీ హాజీరాంబీ వైద్య అధికారులను వేడుకున్నా డిశ్చార్జి చేయలేదు. ఎంపీపీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా చేశారు. దీంతో మళ్లీ నిమ్మనపల్లె ఎంపీపీ ఎన్నిక వాయిదాపడింది. హాజీరాంబీ పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిని ఆమె ఉన్న వార్డులోకి అనుమతించలేదు. దీంతో ఎమ్మెల్యే మెడికల్ సూపరింటెండెంట్ చాంబర్‌కు వెళితే ఆస్పత్రి నుంచే వెళ్లిపోవాలని పోలీసులు కోరారు.
మదనపల్లెలో ప్రజాస్వామ్యం ఖూనీ
మదనపల్లెలో ప్రజాస్వామ్యం నిట్టనిలువునా ఖూనీ అయ్యింది. నిమ్మనపల్లె ఎంపీపీ ఎన్నిక విషయంలో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తొంది. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులపే ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ సభ్యురాలికి స్వేచ్ఛనివ్వకుండా ప్రలోభాలకు గురిచేయడం ఎంతవరకు సమంజసం. మా పార్టీ నుంచి ఎన్నికైన హాజీరాంబీ మాకే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ర్ట ముఖ్యమంత్రి ఇంతటి నీచరాజకీయాలకు పాల్పడమని తెలుగు తమ్ముళ్లను ప్రోత్సహించడం విడ్డూరంగా ఉంది. ఎంపీపీ ఎన్నిక విషయంలో న్యాయం జరగకపోతే ప్రజాకోర్టులో తేల్చుకుంటాం. టీడీపీ చౌకబారు రాజకీయాలను మానుకుని ప్రజాతీర్పును గౌరవించాలి. - దేశాయ్ తిప్పారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే