చంద్రన్న సంక్రాంతి: బూజుపట్టిన బెల్లం, పురుగుల పిండి

Inferior goods distribution In Chandranna Sankranthi Kanuka In Kurnool District - Sakshi

పంపిణీ చేసిన రేషన్‌ అధికారులు

ఆందోళన వ్యక్తం చేసిన లబ్ధిదారులు

సాక్షి, నంద్యాల(కర్నూలు) : ఏపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న చంద్రన్న సంక్రాంతి కానుకల పట్ల ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఉచితం అంటూ పండుగకు పురుగులు పట్టిన సరకులు పంపిణీచేస్తున్నారని రాష్ట్రమంతటా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలో రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు సిద్దం చేసిన సరుకులన్నీ నాసిరకంగా ఉండటంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పురుగులు పట్టిన పిండి, బేడలు, బూజుపట్టిన బెల్లం ఇస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవి తింటే పండుగ రోజున ఆస్పత్రిలో చేరాల్సివస్తుందని భయాందోళనలకు గురవుతున్నారు.

ఉచితం అంటూ సంక్రాంతి పండుగకు ఇలా పురుగులు, బూజు పట్టిన నాసిరకం సరుకులు ఇస్తారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న కానుకలతో కాంట్రాక్టు పొందిన వ్యక్తులకే మేలు కలుగుతోందని.. కార్డుదారులు నాసిరకం వస్తువులతో ఇబ్బంది పడుతున్నారని విమర్శిస్తున్నారు.  పెద్ద మొత్తంలో కాంట్రాక్టు పొందిన వ్యక్తులు తక్కువ ధరకు లభించే నాసిరకం సరుకులు సరఫరా చేశారనే ఆరోపణలు కార్డుదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top