టెంపరేచర్@101 | Sakshi
Sakshi News home page

టెంపరేచర్@101

Published Wed, May 28 2014 12:24 AM

టెంపరేచర్@101

 జ్వరం జనాన్ని వణికిస్తోంది. ఆస్పత్రుల పాల్జేస్తోంది. చిన్నారుల నుం చి వృద్ధుల వరకు మంచం పట్టే ఉన్నారు. అనారోగ్యంతో నీరసిం చిపోతున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి. వాతావరణంలో మార్పు లు చోటుచేసుకోవడంతో జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. నెల రోజుల తర్వాత పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.
 
 విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరంలో కూడా పరిస్థితి భయానకంగా ఉంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుండడంతో జ్వర పీడితులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉంటున్నాయి. సీజన్ ప్రారంభంలోనే జనాలను భయపెడుతున్నాయి. మరో నెల రోజుల తర్వాత పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం పాలవక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి.
 
 ఒక్కో రోజు భారీగా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఎండల్లో విపరీతంగా తిరిగిన వారికి వడ దెబ్బ తగిలి జ్వరం వస్తుంటే.. వర్షాలకు సూక్ష్మజీవులు వృద్ధి చెంది మరికొంత మందికి వైరల్ జ్వరాలు, ఇతర వ్యాధులు వ్యాపిస్తున్నాయి. వాస్తవానికి వేసవి కాలం చివరి నుంచి జ్వరాలు ప్రబలుతుంటాయి. కానీ వాతావరణం లో మార్పులు కారణంగా వర్షాకాలానికి ముందే జ్వరాలు, ఇతర రోగాలు పట్టిపీడిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా మలేరియా జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ప్రధానంగా నగరంలో మరింత ఎక్కువగా ఉన్నాయి. ఎండల కారణంతోనే కాకుండా నీటి కాలుష్యం ద్వారా రోగాలు చుట్టుముడుతున్నాయి. వేసవి తాపానికి దాహం ఎక్కువగా వేస్తుండడంతో అందరూ ఎక్కడ మంచినీరు దొరికినా తాగేస్తుండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీని వల్ల దగ్గు, జలుబుతో పాటు టైఫాయిడ్, ఇతర వైరల్ జ్వరాలు వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ ఇంట్లో ప్రతి ఒక్కరినీ ఇబ్బందులు పెడుతున్నాయి.
 
మున్ముందు భయానకం
వాస్తవానికి ఏటా ఈ సీజన్‌లో ఏజెన్సీలో జ్వరాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరంలో కూడా విపరీతంగా జ్వరాలు వ్యాపిస్తున్నాయి. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉండడంతో దోమలు పెరిగి జ్వరాలు ఎక్కువవుతున్నాయి. ప్రధానంగా మలేరియా, డెంగ్యూ, ఇతర వైరల్ జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సూక్ష్మ జీవులు వృద్ధి చెందే కాలం వస్తుండడంతో వర్షాలు ఎక్కువైతే జ్వరాలు కూడా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలోనే ఈగలు కూడా పెరుగుతుండడంతో జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి.
 
 ఏజెన్సీలో స్ప్రేయింగ్‌కు ఏర్పాట్లు

 అపిడమిక్ సీజన్ దగ్గరపడుతుండడంతో ఏజెన్సీలో స్ప్రేయింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడత స్ప్రేయింగ్ నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన మందులను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే ఏజెన్సీలో గిరిజననులు వ్యాధుల బారినపడుతున్నారు. సరైన వైద్య సదుపాయాలు అందక అవస్థలు పడుతున్నారు.
 
 జాగ్రత్తలు అవసరం
 సీజన్ ప్రారంభంలోనే జ్వరాలు ఎక్కువగా ఉన్నా యి. ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దాహం వేస్తే ఎక్కడపడితే అక్కడ నీరు తా గకూడదు. బయట మార్కెట్‌లో ఫ్రూట్‌జ్యూస్‌లు తాగకపోవడమే మంచిది. జ్యూసుల్లో వేసే ఐస్, నీరు మంచివి కావు. వర్షాలు పడుతుండడంతో ప రిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ జ్వరాలు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా జాగ్రత్త వహించాలి.
 - పి.ఎస్.ఎస్.శ్రీనివాసరావు, కేజీహెచ్ ఫిజీషియన్

Advertisement
 

తప్పక చదవండి

Advertisement