'మహేష్ బాబు అంటే ఇష్టం' | I Am Fan of Mahesh Babu, says Malkajgiri MP | Sakshi
Sakshi News home page

'మహేష్ బాబు అంటే ఇష్టం'

Jul 27 2014 9:35 AM | Updated on Sep 2 2017 10:58 AM

'మహేష్ బాబు అంటే ఇష్టం'

'మహేష్ బాబు అంటే ఇష్టం'

'ప్రిన్స్' మహేష్ బాబుకు అమ్మాయిలే కాదు రాజకీయ నాయకులు అభిమానులుగా మారిపోతున్నారు.

హైదరాబాద్: 'ప్రిన్స్' మహేష్ బాబుకు అమ్మాయిలే కాదు రాజకీయ నాయకులు అభిమానులుగా మారిపోతున్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరికి ప్రాతినిథ్యం వహిస్తున్న చామకూర మల్లారెడ్డి- మహేష్ ఫ్యాన్ అట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మహేష్బాబు తన అభిమాన నటుడని మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి తెలిపారు.

మహేష్ సినిమాలంటే చాలా ఇష్టమని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక హిందీలో సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యరాయ్ తన అభిమాన నటీనటులని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు పిల్లలతో కలిసి ప్రతి ఆదివారం సినిమాకు వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. 61 ఏళ్ల మల్లారెడ్డి తొలి ప్రయత్నంలోనే అతిపెద్ద నియోజకవర్గానికి ఎంపీ అయ్యారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement