భార్య గొంతు కోసిన భర్త | Husband attacks wife with blade | Sakshi
Sakshi News home page

భార్య గొంతు కోసిన భర్త

Nov 24 2015 3:26 PM | Updated on Jul 27 2018 2:18 PM

తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో బ్లేడుతో భార్య గొంతు కోశాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట మార్కెట్‌లో మంగళవారం చోటుచేసుకుంది.

సోంపేట (శ్రీకాకుళం) : తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో బ్లేడుతో భార్య గొంతు కోశాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట మార్కెట్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శ్రీనివాస్(25)కు శ్రీరాంపురానికి చెందిన పద్మ(22)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి భర్త శారీరకంగా హింసిస్తుండటంతో.. ఇటీవల కంచెలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

దీంతో కక్ష పెంచుకున్న శ్రీనివాస్ మంగళవారం సోంపేట మార్కెట్‌లో పద్మతో గొడవ పడి తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోశాడు. ఈ ఘటనలో పద్మ తీవ్రంగా గాయపడింది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement