Sompet
-
సోంపేటలో ఏటీఎం చోరీకి విఫలయత్నం
శ్రీకాకుళం: ఏటీఎంలో నగదు చోరీ చేసేందుకు యత్నించి విఫలమైన ఘటన శ్రీకాకుళం జిల్లాలోని సోపేట మండలం కొర్లాంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు తొలుత సీసీ కెమెరాను ధ్వంసం చేసి అనంతరం ఏటీఏంను ధ్వంసం చేశారు. ఇంతలో ఎవరూ వస్తున్నట్టు అలికిడి వినిపించడంతో దొంగలు అక్కడి నుంచి పరారైనట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్య గొంతు కోసిన భర్త
సోంపేట (శ్రీకాకుళం) : తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో బ్లేడుతో భార్య గొంతు కోశాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట మార్కెట్లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శ్రీనివాస్(25)కు శ్రీరాంపురానికి చెందిన పద్మ(22)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి భర్త శారీరకంగా హింసిస్తుండటంతో.. ఇటీవల కంచెలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కక్ష పెంచుకున్న శ్రీనివాస్ మంగళవారం సోంపేట మార్కెట్లో పద్మతో గొడవ పడి తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోశాడు. ఈ ఘటనలో పద్మ తీవ్రంగా గాయపడింది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
సోంపేట (శ్రీకాకుళం) : రెండు బ్యాగుల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వేస్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. పూరీ నుంచి గాంధీ నగర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్లో రెండు బ్యాగుల్లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు బ్యాగుల గంజాయితో పాటు వాటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.