ఏటీఎంలో నగదు చోరీ చేసేందుకు యత్నించి విఫలమైన ఘటన శ్రీకాకుళం జిల్లాలోని సోపేట మండలం కొర్లాంలో వెలుగుచూసింది.
శ్రీకాకుళం: ఏటీఎంలో నగదు చోరీ చేసేందుకు యత్నించి విఫలమైన ఘటన శ్రీకాకుళం జిల్లాలోని సోపేట మండలం కొర్లాంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు తొలుత సీసీ కెమెరాను ధ్వంసం చేసి అనంతరం ఏటీఏంను ధ్వంసం చేశారు. ఇంతలో ఎవరూ వస్తున్నట్టు అలికిడి వినిపించడంతో దొంగలు అక్కడి నుంచి పరారైనట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.