రెండు బ్యాగుల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సోంపేట (శ్రీకాకుళం) : రెండు బ్యాగుల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వేస్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. పూరీ నుంచి గాంధీ నగర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో రెండు బ్యాగుల్లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు బ్యాగుల గంజాయితో పాటు వాటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.