విశాఖలో హైటెక్ సెంటర్ | High-tech center in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో హైటెక్ సెంటర్

Sep 18 2014 12:16 AM | Updated on Sep 2 2017 1:32 PM

విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా పీసీపీఐఆర్, ఐటీఐఆర్, హైటెక్స్, కన్వెన్షన్, ట్రేడ్ సెంటర్లు తదితర ప్రాజెక్టులు

విశాఖపట్నం: విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా పీసీపీఐఆర్, ఐటీఐఆర్, హైటెక్స్, కన్వెన్షన్, ట్రేడ్ సెంటర్లు తదితర ప్రాజెక్టులు చేపడుతున్న ట్టు ఏపీ రాష్ట్ర మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మాదిరి విశాఖలో 250 ఎకరాల్లో హైటెక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు మధురవాడలో స్థలాన్ని గుర్తించినట్టు వెల్లడించారు. ఈ నెల 29న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభించనున్నట్టు చెప్పారు.
 
 

Advertisement

పోల్

Advertisement