రాగల 24 గంటల్లో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయిని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల మధ్య తీరానికి అనుకొని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అవరించి ఉందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం శనివారం వెల్లడించింది. అలాగే ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దాంతో రాగల 24 గంటల్లో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయిని తెలిపింది. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల భారీగా వర్షాలు పడతాయని తుపాన్ హెచ్చరికల కేంద్రం చెప్పింది.