శ్రీపతికి సిరుల పంట | heavy income on tirumala srivaru | Sakshi
Sakshi News home page

శ్రీపతికి సిరుల పంట

Feb 13 2016 1:50 AM | Updated on Sep 3 2017 5:31 PM

తిరుమల శ్రీవేంకటేశ్వరుని హుండీ ఆదాయం ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది.

రికార్డు స్థాయిలో వెంకన్న ఆదాయం
ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు దాటిన హుండీ కానుకలు
పెరుగుతున్న టీటీడీ బడ్జెట్..హుండీ  కానుకలు

 
 తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరుని హుండీ ఆదాయం ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వార్షిక ఆదాయం చరిత్రలో తొలిసారిగా రూ.వెయ్యి కోట్లు దాటింది. 2015-2016 వార్షిక బడ్జెట్‌లో రూ.905 కోట్లు మాత్రమే రావచ్చని అంచనా వేయగా ఇప్పటికే రూ.1,010 కోట్లు వచ్చాయి. 2003-2004 వార్షిక బడ్జెట్ రూ.590 కోట్లు ఉండగా పదమూడేళ్ల తర్వాత సుమారు నాలుగున్నర రెట్లతో 2016-2017కు రూ. 2,678 కోట్లకు పెరిగింది. అలాగే హుండీ ఆదా యం అప్పట్లో రూ.227 కోట్లు ఉండగా ప్రస్తు తం సుమారు ఐదు రెట్లు రూ. 1,010 కోట్లకు పెరి గింది. అలాగే అప్పట్లో 2003-2004లో డిపాజిట్లపై వచ్చే వడ్డీ సుమారు రూ.50 కోట్లు ఉండగా (డిపాజిట్లు సుమారు రూ.12వేల కోట్లు), 2016-2017 ఆర్థిక సంవత్సరానికి పదిహేను రెట్లు పెరిగి రూ.778.93 కోట్లు రావచ్చని అంచనా వేశారు.

రూ.1.34 లక్షలతో మొదలై...
1951 నవంబర్ నెల మొత్తంగా స్వామివారికి ఆలయ హుండీ ద్వారా లభించిన కానుకలు 1,34,256 రూపాయల 9 అణాల 11పైసలు మాత్రమే. ప్రస్తుతం రోజుకు రూ. 2 నుంచి 3 కోట్లు దాటుతుండటం విశేషం. ఏప్రిల్, మే నెలల్లో  హుండీ ద్వారా నెలకు రూ.80 కోట్లు లభిస్తుం డగా, మిగిలిన నెలల్లో సరాసరిగా రూ. 55 నుంచి రూ.60 కోట్లు లభిస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో పెద్ద మొత్తంలో నోట్ల  కట్టలు లభిస్తుండ టం పెరిగింది. ఆర్థిక సంవత్సరం చివరి నెలలైన ఈ నెలల్లో  ఆదా య పన్ను పద్దులు చూపిం చే సమయం కావటం వల్ల సంపన్నులు ఆ మొత్తాలను హుండీలో సమర్పిస్తున్నట్టు ప్రచారముంది.
 
రూ.12వేల కోట్లపైనే డిపాజిట్లు

2016-2017సంవత్సరానికిగాను రూ. 2678 కోట్ల ప్రతిపాదిత బడ్జెట్‌ను  టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించింది. ఇందులో డిపాజిట్లపై వడ్డీ సుమారు రూ.778.93 కోట్ల రావచ్చని టీటీడీ ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అంటే.. పెట్టుబడులపై తొమ్మిది శాతం వడ్డీ లెక్కిస్తే శ్రీవారి నికర డిపాజిట్లు సుమారుగా రూ.12వేల కోట్ల పైమాటే. పెట్టుబడులపై వచ్చే వడ్డీని టీటీడీ  విని యోగించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆ మొత్తాన్ని కూడా  పూర్తి స్థాయిలోనే తిరి గి డిపాజిట్ల కింద జమ చేసేస్తుండటంతో నిధులు బాగా పెరుగుతున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement