గుండె నిండా బాధ | heart problem for childern | Sakshi
Sakshi News home page

గుండె నిండా బాధ

Feb 25 2014 12:20 AM | Updated on Sep 2 2017 4:03 AM

గుండె నిండా బాధ

గుండె నిండా బాధ

ఈ ఆరేళ్ల చిన్నారి పేరు ఎండీ నజీర్. చందుర్తి మండలం రుద్రంగికి చెందిన శమీమ్-అంకూస్ దంపతుల కుమారుడు. శమీమ్ బుగ్గలు అమ్ముతుండగా, అంకూస్ బిందెలకు మాట్లు వేస్తూ సంచార జీవనం సాగిస్తున్నారు.

 గుండె నిండా బాధ
 
 సిరిసిల్ల,
 ఈ ఆరేళ్ల చిన్నారి పేరు ఎండీ నజీర్. చందుర్తి మండలం రుద్రంగికి చెందిన శమీమ్-అంకూస్ దంపతుల కుమారుడు. శమీమ్ బుగ్గలు అమ్ముతుండగా, అంకూస్ బిందెలకు మాట్లు వేస్తూ సంచార జీవనం సాగిస్తున్నారు.

 

నజీర్‌కు నెలరోజులుగా దమ్ము, దగ్గు వస్తోంది. పది రోజుల కిందట జ్వరం రావడంతో సిరిసిల్ల పిల్లల ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన డాక్టర్ ప్రసాదరావు నజీర్‌కు కార్డియోమయోపతి జబ్బు ఉన్నట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు నిరుపేద తల్లిదండ్రులు అప్పు చేసి మరి నజీర్‌ను కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, ఆపరేషన్ చేసే అవకాశం లేదని, మందులతోనే వైద్యం చేస్తూ తగ్గించాల్సి ఉంటుందని చెప్పారు. సంచార జీవనం సాగించే ఆ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి.

 

 

ఒక్కగానొక్క కుమారుడు నజీర్‌కు వైద్యం చేయించేందుకు చేతిలో డబ్బుల్లేక అసహాయ స్థితిలో హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు తరలించారు. ప్రస్తుతం సిరిసిల్ల సృజన్ పిల్లల ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న నజీర్ గుండె సాధారణంగా ఉండాల్సిన దానికన్నా మూడేరెట్లు అధికంగా ఉందని డాక్టర్ ప్రసాద్‌రావు తెలిపారు. ఇలాంటివి అరుదైన కేసులని, మందులతోనే తగ్గించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం బాలుడు మృత్యువుతో పోరాడుతున్నట్లు తెలిపాడు. ఆర్థికంగా నిరుపేదలైన నజీర్ తల్లిదండ్రులు దేవునిపై భారం వేసి దీనంగా చూస్తున్నారు. ఇప్పటికే రూ.30 వేల వరకు అప్పులు చేశామని.. మరో రూ.లక్ష వరకు అవసరమవుతాయని.. ఇక అప్పులు కూడా దొరకడం లేదని.. దాతలెవరైనా ఆర్థికసాయం అందిస్తే తమ కుమారుడు బతికే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 ఆర్థికంగా ఆదుకునే మానవతావాదులు, దాతలు 9640527978, 9618987085 నంబర్లలో సంప్రదించవచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement