వంద కార్లతో.. అదిరిపోయేలా...

Grand Welcome to Raghu Rama Krishnam Raju - Sakshi

వైసీపీలో చేరిన రఘురామ కృష్ణంరాజుకు ఘన స్వాగతం

ఆకివీడు: తెలుగుదేశంలో ఇమడలేక వైఎస్సార్‌సీపీలో చేరి మొదటి సారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన  కనుమూరు రఘురామకృష్ణంరాజుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఉప్పుటేరు వంతెన వద్దకు చేరుకోగానే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పూలమాలలు, గజమాలలతో ఘనంగా సత్కరించారు. కృష్ణార్జునుల చిత్రపటాన్ని అందజేశారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం కార్ల ర్యాలీలో ఆకివీడు, అయిభీమవరం చేరుకోగానే స్థానిక ప్రజలు బ్రహ్మరధం పట్టారు. అనంతరం చెరుకుమిల్లి, ఏలూరుపాడు, జువ్వలపాలెం, కాళ్లకూరు చేరుకున్నారు. కాళ్లకూరు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

కాళ్ల మీదుగా సీసలి, జక్కరంలో మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. పెదమిరంలోని రఘురామకృష్ణంరాజు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పార్టీలో చేరారు. రఘురామకృష్ణంరాజుకు స్వాగతం పలికినవారిలో నర్సాపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సలహాదారుడు పాతపాటి సర్రాజు, జిల్లా యువజనవిభాగం అధ్యక్షుడు మంతెన యోగేంద్రకుమార్, మండల కన్వీనర్‌లు కేశిరెడ్డి మురళీ, గులిపల్లి అచ్చారావు, నాయకులు నంద్యాల సీతారామయ్య, జగ్గురోతు విజయ్‌కుమార్, షేక్‌ హుస్సేన్, అంబటి రమేష్, మోరా జ్యోతి, జి.ధనరాజు, జోగి నాగరాజు, జామి శ్రీనివాస్, పుప్పాల పండు, శిరపు శ్రీనివాస్, కొత్తపల్లి నాగరాజు, కనుమూరు ఆనంద వర్మ పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top