ప్రతిపక్ష నేతలందరికీ గవర్నర్ ఫోన్ | Governor Narasimhan phone to opposition leaders | Sakshi
Sakshi News home page

ప్రతిపక్ష నేతలందరికీ గవర్నర్ ఫోన్

Feb 19 2014 8:47 PM | Updated on Jul 29 2019 5:28 PM

గవర్నర్ నరసింహన్ - Sakshi

గవర్నర్ నరసింహన్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వ్యవహారంపై ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వ్యవహారంపై ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉంది. సీఎం పదవికి రాజీనామా చేస్తూ ఆయన  గవర్నర్ నరసింహన్కు లేఖ సమర్పించడం, ఆయన ఆమోదించడం అన్నీ చెకచెకా జరిగిపోయాయి. సంప్రదాయం ప్రకారం గవర్నర్ ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలకు ఫోన్ చేసి చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, బిజెపి సీనియర్ నేత దత్తాత్రేయలకు సిఎం రాజీనామా విషయాన్ని తెలియజేశారు. ఇక ఏం చేయాలనేదాని కోసం గవర్నర్ ఢిల్లీ సూచనల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా విషయం రేపు ఉదయం ఢిల్లీలో జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. సిఎం రాజీనామా చేసిన వెంటనే గవర్నర్ ఆమోదించడం, ఆ తరువాత సంప్రదాయం ప్రకారం  ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని  కోరకపోవడం పలు రకాల ఆలోచనలకు దారి తీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement