కాదేదీ ప్రచారానికి అనర్హం!

Government Propaganda In August 15th Celebrations - Sakshi

పంద్రాగస్టు వేడుకల్లోనూ  ప్రభుత్వ ప్రచారమే

చంద్రబాబు జపం చేసేందుకు అధికారుల ప్రయత్నం

ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ బెలూన్ల ప్రదర్శనకు ఏర్పాట్లు

మంత్రుల కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులు

బడ్డీల తొలగింపుపై చిరువ్యాపారుల ఆవేదన

శ్రీకాకుళం న్యూకాలనీ : శ్రీకాకుళంలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకలను కూడా అధికార పార్టీ నా యకులు తెలివిగా తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో మం త్రుల కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తుండడం అందుకు ఉదాహరణ. పంద్రాగస్ట్‌ వేడుకల్లో చం ద్రబాబు సర్కారు ప్రభుత్వ సంక్షేమ పథకాల తీ రును వివరిస్తు పార్టీ సభను తలపిస్తూ బెలూ న్లను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండటం ఇందుకు మరో నిదర్శనంగా కనిపిస్తోంది.  

శ్రీకాకుళం అభివృద్ధి చెందుతోందని ఇక్కడ పంద్రాగస్ట్‌ వేడుకలు ఏర్పాటుచేశామని, అందుకు సీఎం అంగీకరించారని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నా వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం అం దుకు భిన్నంగా తయారైంది. అభివృద్ధి పేరిట పేద, బడుగు, చిరువ్యాపారుల కుటుంబాలను రోడ్డున పడేసిన సర్కారు.. తాజాగా తమ పథకా లను ప్రదర్శించి ప్రజలకు ఆకర్షితులను చేసేం దు కు ఈ వేడుకలను ఉపయోగించుకోవడంపై ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నా యి.

‘వాడవాడలా చంద్రన్న బాట’ పేరిట ఏర్పాటుచేసిన బెలూన్‌ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అది చూసిన జనాలు విస్తుపోతున్నారు. వాటిని తక్షణమే తొలగించాలని పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. సీఎం రాకతో నగరంలో పోలీసుల ఆంక్షలు సైతం అదే రీతిలో పెచ్చుమీరుతున్నాయి. వేడుకలకు సమీపంలో ఉ న్న శాంతినగర్‌కాలనీ, నెహ్రూనగర్‌కాలనీ, ఆర్‌కే నగర్‌కాలనీ వాసులు.. పోలీసు ఆంక్షలతో కనీసం పాలప్యాకెట్లకు కూడా నోచుకోవడం లేదని, తమ పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేడుకల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, కానిస్టేబుళ్లు, ఎన్‌సీసీ క్యాడెట్స్, స్కౌట్స్, గైడ్స్, విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. వర్షాలతో వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వసతులు, భోజనాలు పూర్తిస్థాయిలో లేక అల్లాడిపోతున్నారు. అధికారులు ఏసీ గదుల్లో బాగానే ఉంటున్నా.. ఉద్యోగులు, కానిస్టేబుళ్లు, విద్యార్థులు ఎవరికీ చెప్పుకోలేక మదన పడుతున్నారు. 

అన్నీ తొలగింపులే.. 

ఆగస్టు 15 సందర్భంగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో రోజువారి చిరువ్యాపాలతో తోపుడు బళ్లు, బడ్డీలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. ఇప్పటికే వారం రోజులుగా పాలకొండ రోడ్, ఆర్ట్స్‌ కళాశాల రోడ్, రెవెన్యూ గెస్ట్‌ హౌస్‌ రోడ్, డై అండ్‌ నైట్‌ నాలుగువైపుల గల మార్గాల్లో ఉన్న అనాథలను, చిరు వ్యాపారులను వెళ్లగొట్టారు. 

ఇప్పటికే సుమారుగా 400 కుటుంబాలు సీఎం పర్యటన పుణ్యమా అని రోడ్డున పడ్డాయి. తాజాగా సోమవారం రాత్రి మరింత హంగామా సృష్టించారు. కాంప్లెక్స్‌ నుంచి బలగ వైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరువ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. బడ్డీలను, తోపుడు బళ్లను క్రెయిన్ల సాయంతో తొలగిస్తున్నారు. దీంతో మరో 60 కుటుంబాలు జీవాన ఆధారం కోల్పోయి రోడ్డున పడుతున్నాయి.

సంక్షేమ పథకాల బెలూన్లలో ఎయిర్‌గ్యాస్‌తో నింపుతున్న సిబ్బంది 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top