ఏపీలో అన్‌లాక్‌ 2.0 అమలు ఉత్తర్వులు జారీ

Government Of Andhra Pradesh Release Unlock 2.0 Implementation Orders - Sakshi

సాక్షి, ఏపీ సచివాలయం : ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లాక్‌ 2.0 అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు వెలువరించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో నిబంధనలు అమలు చేయాలని.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా, కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను దశలవారీగా‌ సడలించే ప్రక్రియలో భాగంగా కేంద్రం ఇటీవల అన్‌లాక్‌ 2.0 మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి 31 వరకు అన్‌లాక్‌ 2.0 అమల్లో ఉంటుందని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.(చదవండి : అన్‌లాక్‌–2 మార్గదర్శకాలు ఇవే..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top