జనవరి నుంచి టిటిడి సత్రాలలో ఉచిత భోజనం | Free lunch in TTD dormitorie from January | Sakshi
Sakshi News home page

జనవరి నుంచి టిటిడి సత్రాలలో ఉచిత భోజనం

Oct 13 2013 8:20 PM | Updated on Sep 1 2017 11:38 PM

బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు.

తిరుమల: బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. భక్తులకు పూర్తిగా సేవలు అందించలేక పోయమని ఆయన బాధపడ్డారు. జనవరి నుంచి టీటీడీ సత్రాల్లో భక్తుల సౌకర్యార్ధం ఉచిత భోజన వసతి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యతను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రసాదాల తయారి దిట్టంలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. నడకదారి భక్తులకు ఇచ్చే ఉచిత లడ్డూ పథకం కొనసాగింపు గురించి పాలకమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బాపిరాజు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement