‘గ్రామ వాలంటీర్లతో అక్రమాలకు అడ్డుకట్ట’ | Food Corporation Chairman JR Pushparaj on Tour in Gannavaram Mandal | Sakshi
Sakshi News home page

‘గ్రామ వాలంటీర్లతో అక్రమాలకు అడ్డుకట్ట’

Oct 3 2019 4:45 PM | Updated on Oct 3 2019 4:57 PM

Food Corporation Chairman JR Pushparaj on Tour in Gannavaram Mandal - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా : గన్నవరం మండలంలో పుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జేఆర్‌ పుష్పరాజ్‌ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గన్నవరం సివిల్‌ సప్లై గోదాము, కేసరపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రం, రేషన్‌ షాపులను తనిఖీ చేశారు. అనంతరం పుష్పరాజ్‌ మాట్లాడుతూ.. పేదల బియ్యం అక్రమ రవాణా చేసేవారిపై ఇప్పటికే 775 సుమోటో కేసులు నమోదు చేసి జిల్లా కలెక్టర్లకు పంపామని తెలిపారు. వాటిలో 602 కేసులలో కలెక్టర్లు చర్యలు తీసుకొని రిపోర్టు ఇచ్చారని వెల్లడించారు.

అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకంలో ఇస్తున్న గుడ్లల్లో లోపాలను గుర్తించామని, పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ వాలంటీర్ల ద్వారా అక్రమార్కులకు అడ్డుకట్ట పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఈ సందర్భంగా జేఆర్‌ పుష్పరాజ్‌ అభినందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement