2016లో ఫ్లీట్ రివ్యూ | Fleet Review in 2016 | Sakshi
Sakshi News home page

2016లో ఫ్లీట్ రివ్యూ

Jan 27 2015 3:35 AM | Updated on Sep 2 2017 8:18 PM

చ్చే ఏడాది ఫిబ్రవరిలో 60 దేశాల నౌకాదళాల యుద్ధనౌకల సమీక్షకు విశాఖ సన్నద్ధమవుతోందని తూర్పు నావికాదళ చీఫ్ సతీష్‌సోనీ చెప్పా రు.

విశాఖపట్నం: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 60 దేశాల నౌకాదళాల యుద్ధనౌకల సమీక్షకు విశాఖ సన్నద్ధమవుతోందని తూర్పు నావికాదళ చీఫ్ సతీష్‌సోనీ చెప్పా రు. భారత్ స్వాతంత్య్రం అనంతరం ఒక్కసారి మాత్రమే ఇలాంటి ఫ్లీట్ రివ్యూ జరగ్గా.. వచ్చే ఏడాది  మరోసారి నిర్వహించనుందని తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన సోమవారం నావల్ పరేడ్ గ్రౌండ్‌లో గౌరవ వందనాన్ని స్వీకరించి కవాతును పరిశీలించారు.

2016 ఫిబ్రవరిలో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షకు విశాఖ వేదిక కావడం తూర్పు నావికా దళానికే కాకుండా భారత నావికాదళ చరిత్రలోనే మరో మైలురాయి అని  సతీష్‌సోనీ చెప్పారు.  తీరరక్షణతోపాటు తూర్పుతీర దేశాలకు సహాయసహాకారాలు అందించడంలోనూ నావికాదళం ముందు ఉందన్నారు. ప్రకృతి విపత్తులవేళ పలు సేవలు అందించిందని గుర్తు చేశారు. ఈఎన్‌సీకీ చెందిన ఫ్లాగ్ ఆఫీసర్లు, నావికాదళ అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement