తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం | Fire Breaks Out In A Medical Store In Tirupati Due To Short Circuit | Sakshi
Sakshi News home page

తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం

Oct 1 2019 2:15 PM | Updated on Oct 1 2019 2:21 PM

Fire Breaks Out In A Medical Store In Tirupati Due To Short Circuit - Sakshi

సాక్షి, తిరుపతి: చిన్న బజారు వీధిలోని లలితా మెడికల్ స్టోర్‌లో మంగళవారం షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కొన్ని క్షణాల్లోనే.. లలితా మెడికల్ స్టోర్‌తో పాటు పక్కనే ఉన్న కూల్‌డ్రింక్‌ షాపు పూర్తిగా కాలి బూడిదగా మారాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి, బతుకుజీవుడా అంటూ బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా షార్టుసర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ ఆఫీసర్ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాదంలో 15 లక్షలమేర ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement