బకాయిల కోసం చెరకు రైతుల ధర్నా | farmers dharna at vijayanagaram | Sakshi
Sakshi News home page

బకాయిల కోసం చెరకు రైతుల ధర్నా

Sep 7 2015 1:43 PM | Updated on Oct 1 2018 2:44 PM

బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు చెరుకు కర్మాగారం ఎదుట ధర్నాకు దిగారు.

సీతానగరం: బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు చెరకు కర్మాగారం ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటన సోమవారం విజయనగరం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. మండల కేంద్రం సమీపంలోని ఎన్‌సీహెచ్ చక్కెర కర్మాగారం ఎదుట బాధిత రైతులు ఆందోళన దిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యం దాదాపు రూ.7 కోట్లు మేర రైతులకు బకాయి పడింది. దీంతో రైతులు ఫలు దఫాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపారు.

అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో రైతులు కోర్టుకు వెళ్లారు. దీంతో రైతులుకు ఆగస్టు నెలఖారు లోపు విడతలవారిగా బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కాని యాజమన్యాం చెల్లించలేదు. దీంతో రైతులు పలుమారు ఆందోళనకు దిగారు. ఈ రోజు కూడా రైతులకు ఆందోళనకు దిగడంతో ఫ్యాక్టరీ ఎదుట పెద్ద మొత్తంలో పోలీసు బలగాలను మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement