నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు | Excise raids on bases alcohol shops | Sakshi
Sakshi News home page

నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

Published Thu, Apr 9 2015 12:51 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

విజయనగరం జిల్లా గుర్లా మండలంలోని దేవునిపాక గ్రామంలో ఎక్సైజ్ అధికారులు గురువారం విస్తృత స్థాయిలో దాడులు జరిపారు.

విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా గుర్లా మండలంలోని దేవునిపాక గ్రామంలో ఎక్సైజ్ అధికారులు గురువారం విస్తృత స్థాయిలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో సుమారు 1300 లీటర్ల నాటు సారాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా 2500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కాగా, ఎక్సైజ్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ఈ దాడులు జరిపారు. అయితే, ఈ దాడుల విషయం ముందే తెలియడంతో నిందితులందరూ పరారయ్యారని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
(గుర్లా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement