ఆంధ్రా సరిహద్దులో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరి మృతి | Encounter In Andhra Chhattisgarh Border Two Maoist Died | Sakshi
Sakshi News home page

ఆంధ్రా సరిహద్దులో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరి మృతి

Jul 29 2019 10:32 AM | Updated on Jul 29 2019 10:35 AM

Encounter In Andhra Chhattisgarh Border Two Maoist Died - Sakshi

రాయ్‌పూర్‌: ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టుల కాల్పులు కలకలం రేపాయి. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని సుకుమా జిల్లా కుంట పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బాలంతోడు అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. పోలీసులకు స్పల్ప గాయాలు అయ్యాయి. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో అటవీ ప్రాంతంలో పోలీసులు గత రెండు రోజులుగా భారీ ఎత్తున కూంబింగ్‌ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల కదలికలపై పోలీసులతో పాటు భద్రతా సిబ్బంది కూడా అటవీ ప్రాంతాన్ని గాలిస్తోంది. ఈ సమయంలో బాలంతోగు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని గాలింపు మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులు చేయడంతో.. పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఇద్దరు మృతి చెందగా.. మరికొంతమంది తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కుంట పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement