గజ రాజుల బీభత్సం, వణుకుతున్న గిరిజనులు | Elephants Mob Destroying crops in Srikakulam district | Sakshi
Sakshi News home page

గజ రాజుల బీభత్సం, వణుకుతున్న గిరిజనులు

Jul 16 2014 9:18 AM | Updated on Sep 2 2017 10:23 AM

శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులకు ఏనుగులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హిర మండలం బొందిగూడలో...

హిర : శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులకు ఏనుగులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హిర మండలం  బొందిగూడలో  ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి. ఇళ్లు, పొలాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. ఏనుగులు రెచ్చిపోతుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని గ్రామస్తులు భయంతో వణికి పోతున్నారు.

 

అడవిలో ఉండాల్సిన ఏనుగులు ఆవాసాలలోకి చొచ్చుకు వచ్చేస్తున్నాయి. పొలాలకు వెళితే ఎటువైపు నుంచి తమపై దాడి చేస్తాయోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు గిరిజనులను గ్రామం నుంచి ఖాళీ చేయిస్తున్నారు. గత వారం ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement