ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే ఎంసెట్-15 అభ్యర్థులకు శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు జిల్లాలో
ఏలూరు సిటీ : ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే ఎంసెట్-15 అభ్యర్థులకు శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు జిల్లాలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏలూరులో సెయింట్ థెరిస్సా మహిళ స్వయం ప్రతిపత్తి కళాశాల, భీమవరంలో ఎస్‌ఎంటీబీ సీతా పాలిటెక్నిక్ కళాశాల, తణుకులోని ఎస్‌ఎంవీఎం పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్‌లైన్ కేంద్రాలు ఉన్నాయి. విద్యార్థులు సర్టిఫికెట్లతో ఆయా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎస్టీ అభ్యర్థులు మాత్రం తణుకులోని హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లాలి. శుక్రవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానుంది. 14నుంచి విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలను ఎంపిక చేసుకుని అప్షన్లు పెట్టుకునే అవకాశం ఇచ్చారు.
ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి
కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారు విధిగా ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల ఫొటోస్టాట్ కాపీలు తీసుకెళ్లాలి. ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్టు, హాల్‌టికెట్, ఇంటర్మీడియెట్ మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్, ఎస్‌ఎస్‌సీ మార్కుల సర్టిఫికెట్, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, నివాస, ఆదాయ, అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డుతో హాజరుకావాలి.
సర్టిఫికెట్ల పరిశీలన షెడ్యూల్ ఇలా
ఈనెల 12న 1నుంచి 15వేల ర్యాంకు వరకు, 13న 15,001నుంచి 30 వేల వరకు, 14న 30,001నుంచి 45000 వరకు, 15న 45,001నుంచి 60వేల వరకు ర్యాంకులు వచ్చిన విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. ఈనెల 16న 60,001 నుంచి 75 వేల వరకు, 17న 75,001నుంచి 90వేల వరకు, 18న 90,001నుంచి 1,05,000వరకు, 19న 1,05,001నుంచి 1,20,000వరకు, 20న 1,20,001 నుంచి చివరి ర్యాంకు వారి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు.
వెబ్ ఆప్షన్ షెడ్యూల్ ఇదీ : ఈనెల 14, 15 తేదీల్లో 1వ ర్యాంకు నుంచి 30వేల ర్యాంకు వరకు, 16, 17 తేదీల్లో 30,001 నుంచి 60వేల వరకు, 18, 19 తేదీల్లో 60,001 నుంచి 90 వేల వరకు, 20, 21 తేదీల్లో 90,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్స్‌ను అవకాశం ఇస్తారు. 22, 23 తేదీల్లో విద్యార్థులకు ఆప్షన్లను మార్పు చేసుకునే అవకాశం కల్పించారు. 26న విద్యార్థులు ఎంపిక ఆధారంగా సీట్లు కేటాయింపు జరుగుతుంది. వికలాం గులు, సైనికుల పిల్లలు, ఆంగ్లో ఇండియన్స్, స్పోర్ట్స్, గేమ్స్, ఎన్‌సీసీ కేటగిరీ విద్యార్థులకు విజయవాడ బెంజ్ సర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.900, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 ఫీజు చెల్లించాలి. విద్యార్థులు ్చఞ్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీలో లాగిన్ అవ్వాల్సి ఉంది.